కరోనా ధాటికి కుదేలైన దేశాల్లో భారత్ ఒకటి. ఈ మహమ్మారి దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్లో మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది.
ప్రతి పది లక్షల కేసుల్లో 81 కంటే తక్కువగానే మరణాలు నమోదవుతున్నాయి. అక్టోబర్ 4 నుంచి మరణాల రేటు క్షీణిస్తోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉన్న ఈ రేటు.. మార్చి 22 నుంచి తొలిసారి కనిష్ఠానికి చేరింది. మెరుగైన నియంత్రణ చర్యల వల్ల 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.
" క్రమంగా కొవిడ్-19 మరణాల రేటు తగ్గుతోంది. ప్రస్తుతం 1.52 శాతంగా ఉంది. మార్చి 22 నుంచి తొలిసారి ఈ రేటు అత్యల్పానికి చేరింది"