కరోనాను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ కారణంగానే మరణాల రేటు 2.28 శాతానికి తగ్గిందని.. దీంతో భారత్.. కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల జాబితాలో ముందుందని స్పష్టం చేసింది. అంతే కాదు, దేశంలో కరోనాను జయిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని.. ఇప్పటికే 9 లక్షల మందికి పైగా కరోనాను జయించారని వెల్లడించింది.
"సంపూర్ణ సంరక్షణ విధానాల ద్వారా సమర్థమైన నియంత్రణ వ్యూహం, వేగవంతమైన పరీక్షలు, ఆరోగ్య ప్రామాణికాలతో కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గింది."
-ఆరోగ్య మంత్రిత్వ శాఖ