దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య తాజాగా లక్ష దాటింది. శుక్రవారం ఒక్కోరోజే దేశవ్యాప్తంగా 1,069 మంది మహమ్మారికి బలయ్యారు. ఫలితంగా భారత్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,00,842కు చేరింది. శనివారం ఈ గణాంకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మరణించిన వారిలో దాదాపు 70 శాతం మంది కరోనాతో పాటు ఇతర ఆరోగ్య కారణాలతో ఇబ్బందిపడుతున్నట్లు స్పష్టం చేసింది.
భారత్‌లో 'లక్ష' దాటిన కరోనా మరణాలు..
భారత్‌లో కరోనా కేసులతో పాటు వైరస్ మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం మరో 1,069 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య లక్ష దాటేసింది.
దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు..
కొద్ది రోజులుగా కేసులు 90 వేల దిగువనే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 79 వేల 476 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 64,73,545 చేరగా.. ఇందులో 9,44,996 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 54,27,707 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం కొవిడ్‌కు బాగా దెబ్బతిన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది భారత్. అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరణాల్లోనూ యూఎస్, బ్రెజిల్ తర్వాత మనదేశం మూడో స్థానంలో ఉంది.