తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టాప్​ గేర్​లో కరోనా- 10 రోజుల్లోనే లక్ష కేసులు - కేవలం 10 రోజుల్లోనే లక్ష కేసులు

కరోనా మహమ్మారి భారత్​లో అంతకంతకూ విజృంభిస్తోంది. కేవలం ఈ 10 రోజుల్లోనే కొత్తగా లక్ష కేసులు పెరిగిపోయాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 3 లక్షల 8 వేలకు మించిపోయాయి.

India's COVID-19 cases jump from 2 lakh to 3 lakh in 10 days as it records worst daily spike
కేవలం 10 రోజుల్లోనే లక్ష కేసులు

By

Published : Jun 13, 2020, 1:34 PM IST

భారత్​లో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో మొత్తం కేసులు 3 లక్షలు దాటాయి. అంటే గడచిన 10 రోజుల్లోనే కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి.

దేశంలో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు

వేగం పెంచిన కరోనా

భారత్​లో మొదటి లక్ష కరోనా కేసులు నమోదు కావడానికి 64 రోజులు పట్టింది. ఆ తరువాత కేవలం పక్షం రోజుల్లోనే మరో లక్ష కేసులు పెరిగి... 2 లక్షల మార్కును చేరుకున్నాయి. కానీ ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే మరో లక్ష కేసులు పెరిగిపోయాయి.

నాలుగో స్థానంలో

భారత్​ కరోనా టోల్​

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం... శుక్రవారం దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 11,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 386 మంది కరోనాతో మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 8,884కి పెరిగింది.

ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్​ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

దాదాపు 50 శాతం కోలుకున్నారు..

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కరోనా కేసులు రెట్టింపు అయ్యే వ్యవధి 15.4 రోజులు నుంచి 17.4 రోజులకు పెరిగింది. ఇప్పటి వరకు 49.9 శాతం మంది బాధితులు కోలుకున్నారు.

కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలు

రాష్ట్రాల వారీగా కరోనా మరణాలు

కొత్తగా నమోదైన 386 కరోనా మరణాల్లో.. దిల్లీ- 129, మహారాష్ట్ర- 127, గుజరాత్​- 30, ఉత్తర్​ప్రదేశ్​- 20, తమిళనాడు- 18, బంగాల్​- 9, మధ్యప్రదేశ్​- 9, తెలంగాణ- 9, కర్ణాటక- 7, రాజస్థాన్​- 7, హరియాణా- 6, ఉత్తరాఖండ్​- 6, పంజాబ్​- 4, అసోం- 2: కేరళ, జమ్ము కశ్మీర్​, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు

భారత్ వర్సెస్ రాష్ట్రాలు

ఇదీ చూడండి:సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: నరవాణే

ABOUT THE AUTHOR

...view details