భారత్లో తాజాగా నమోదైన కరోనా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య అరకోటి దాటింది. గత మూడు రోజుల్లో కాస్త తగ్గుదల కనిపించినా.. కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే మరో 90,123 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే 1,290 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 50 లక్షల 20 వేలు దాటింది.
దేశంలో కోలుకుంటున్న కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 39.42 లక్షల మందికిపైగా కోలుకోవడం వల్ల రికవరీ రేటు 78.53 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మరణాలు రేటు 1.63 శాతానికి తగ్గింది.