దేశంలో కరోనా బాధితుల సంఖ్య కొన్ని వారాల నుంచి నిలకడగా తగ్గుతుండటం వల్ల క్రియాశీలక కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా యాక్టివ్ కేసులు 3.62 శాతానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల క్రియాశీల కేసుల సంఖ్య 3,56,546కు చేరింది.
దేశంలో మరింత దిగువకు యాక్టివ్ కేసులు
భారత్లో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతున్నాయి. ఫలితంగా క్రియాశీలక కేసులు 3.62 శాతానికి క్షీణించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో తక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది.
దేశంలో 3.62 శాతానికి తగ్గిన యాక్టివ్ కేసులు
ఇతర ముఖ్యాంశాలు..
- గడిచిన ఏడు రోజులుగా ప్రతి 10 లక్షల జనాభాకు అతి తక్కువ కేసులు నమోదవుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి.
- ఇప్పటివరకు 93,57,464 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీలు, యాక్టివ్ కేసుల మధ్య వ్యత్యాసం స్థిరంగా పెరిగి.. 90 లక్షలు దాటింది.
- కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 75.71 శాతం కేరళ, మహారాష్ట్ర, బంగాల్, దిల్లీ, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవే.
- తాజాగా కరోనాతో మరణించినవారిలో 77.78 శాతం పది రాష్ట్రాల్లో నమోదయ్యాయి. వాటిలో 79.28 శాతం మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్ నుంచే కావడం గమనార్హం.
ఇదీ చూడండి:ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా