తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు - భారత్​లో కరోనా కేసులు

దేశంలో రెండు నెలల తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షల దిగువకు వచ్చింది. పాజిటివ్​ కేసుల సంఖ్య వరుసగా ఐదవరోజు 60 వేల లోపు నమోదవటం సహా కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం వల్ల యాక్టివ్​ కేసుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటినట్లు కేంద్రం వెల్లడించింది.

India's active caseload
భారత్​లో కరోనా మహమ్మారి ఉద్ధృతి

By

Published : Oct 23, 2020, 12:52 PM IST

Updated : Oct 23, 2020, 1:17 PM IST

భారత్​లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. వరుసగా ఐదో రోజూ కరోనా పాజిటివ్​ కేసులు 60 వేల లోపే నమోదయ్యాయి. మరోవైపు వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం దాదాపు 74 వేల మంది వైరస్​ బారినుంచి బయటపడ్డారు.

63 రోజుల తర్వాత.. దేశంలో తొలిసారి క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 6,95,509 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నాయి. గతంలో ఆగస్టు 22న యాక్టివ్​ కేసులు 7 లక్షల లోపు (6,97,330) ఉన్నాయి.

10 కోట్ల పరీక్షలు..

కరోనా పరీక్షల్లో భారత్​ మరో మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 14.5 లక్షల టెస్టులు నిర్వహించగా.. గడిచిన 9 రోజుల్లోనే కోటి పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపింది.

ఆ రాష్ట్రాల్లో అధిక పాజిటివిటీ రేటు..

దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.81 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.8 శాతం మాత్రమే. అయితే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు.. జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉండటం ఆయా రాష్ట్రాల్లో కఠిన చర్యల చేపట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు

ఇదీ చూడండి: భారత్​లో మరో 54 వేల కేసులు.. 690 మరణాలు

Last Updated : Oct 23, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details