ప్రపంచ మహిళా దినోత్సవం రోజున భారత వనితలు సత్తా చాటారు. పానిపత్లో 50వేల మంది ఒకేసారి పరిగెత్తి చరిత్ర సృష్టించారు.
నారీశక్తి కొత్త రికార్డ్ - world record
భారత మహిళలు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. హరియాణా పానిపత్లో ఒకేసారి 50వేల మంది పరిగెత్తి జపాన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు.
నారీశక్తి కొత్త రికార్డ్
జపాన్లో ఒకేసారి 25వేల మంది మహిళలు పరిగెత్తి గతంలో రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు హరియాణాలో అందుకు రెట్టింపు సంఖ్యతో వనితలు పాల్గొనడం విశేషం.
ఈ కార్యక్రమాన్ని అమర జవాన్లకు అంకితం చేస్తూ జెండా ఊపి పరగు పందెం ప్రారంభించారు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.
పరుగులో పాల్గొన్న మహిళలందరూ గులాబీ రంగు దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.