తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుబాయ్​కి వెళ్లి భార్యను హత్య చేసిన భర్త - దుబాయ్​లో దారుణ హత్య

దుబాయ్​కి పర్యటన వీసా మీద వెళ్లిన వ్యక్తి తన భార్యను హత్యచేశాడని అక్కడి పత్రికలు వెల్లడించాయి. కార్యాలయం నుంచి బయటకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడచినట్లు తెలుస్తోంది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని స్థానిక కోర్టు తెలిపింది.

Indian visits UAE kills wife over suspected infidelity
దుబాయ్​కి వెళ్లి భార్యను హత్య చేసిన భర్త

By

Published : Feb 15, 2020, 12:01 AM IST

Updated : Mar 1, 2020, 9:28 AM IST

భార్యపై అనుమానంతో జనాలు చూస్తుండగానే దాడికి పాల్పడి కత్తితో పొడిచి చంపాడో భర్త. పని నిమిత్తం దుబాయ్​లో ఉన్న భార్యను కలిసేందుకు పర్యటన వీసాపై వెళ్లి ప్రాణాలు తీశాడు.

పబ్లిక్ ప్రాసిక్యూషన్​ రికార్డుల ప్రకారం.. విచారణలో ఉన్న వ్యక్తి గతేడాది సెప్టెంబర్​ 9న అల్​-క్వాజ్​ పారిశ్రామిక ప్రాంతంలోని తన భార్య కార్యాలయంలోకి వెళ్లాడు. తన భార్యకు, ఆమె మేనేజర్​ నుంచి వచ్చిన సందేశంపై ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. కార్యాలయం బయటికి రాగానే.. కత్తితో దాడికి దిగాడు.

ఆమె పారిపోవాలని ప్రయత్నించినా.. వెంబడించి ఈ దారుణానికి ఒడి గట్టాడని తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పారిపోవాలని చూడగా పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

వీరికి భారత్​లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి:రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!

Last Updated : Mar 1, 2020, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details