ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్ నేషనల్ స్పేస్, ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అన్న కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఈ సంస్థ రూపురేఖలు ఖరారు చేస్తామని కేంద్ర అణు ఇంధన, అంతరిక్ష వ్యవహారాలశాఖ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. అంతరిక్షాన్ని ఉపయోగించుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఇస్రో సేవలు