తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​పై పాక్​ ప్రధానిదో మాట- సైన్యానిది మరో మాట

కర్తార్​పుర్​ యాత్రికులకు పాస్​పోర్ట్ అవసరం లేదన్న పాకిస్థాన్... ఇప్పుడు మాట మార్చింది. భారతీయ సిక్కు సందర్శకులకు పాస్​పోర్ట్​ తప్పనిసరి అంటోంది.

కర్తార్​పుర్​పై పాక్​ ప్రధానిదో మాట- సైన్యానిది మరో మాట

By

Published : Nov 7, 2019, 1:13 PM IST

Updated : Nov 7, 2019, 3:46 PM IST

కర్తార్​పుర్​పై పాక్​ ప్రధానిదో మాట- సైన్యానిది మరో మాట
కర్తార్​పుర్​ సాహిబ్​ను భారతీయ సిక్కులు సందర్శించేందుకు పాస్​పోర్ట్​ తప్పనిసరి అని స్పష్టం చేసింది పాకిస్థాన్​​.

మాట మార్చేశారు

కర్తార్​పుర్​ నడవా భారత్​లోని డేరా బాబా నానక్ నుంచి దర్బార్​ గురుద్వారా సాహిబ్​ను కలుపుతుంది. ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 4 కిలోమీటర్లు ఉంటుంది.

కర్తార్​పుర్​ గురుద్వారా సాహిబ్​ను దర్శించుకునేందుకు పాస్​పోర్ట్​ అవసరం లేదని, ఏదైనా ఒక గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుందని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ నవంబర్ 1న​ ప్రకటించారు. అయితే... భారత్​-పాక్​ మధ్య జరిగిన ఒప్పందంలో ఈ విషయం ఎక్కడా లేదు. అందుకే యాత్రికులకు పాస్‌పోర్ట్ అవసరమా లేదా అని స్పష్టం చేయాలని పాకిస్థాన్‌ను బుధవారం కోరింది భారత్​. ఒక రోజు తర్వాత పాక్​ సైన్యం స్పందించింది. పాస్​పోర్ట్ తప్పనిసరని తేల్చిచెప్పింది.

"మాకు భద్రతా సంబంధిత ఆంక్షలు ఉన్నాయి. పాస్​పోర్ట్ ఆధారిత ప్రవేశమే చట్టబద్ధమైనది. భద్రత, సార్వభౌమత్వంలో రాజీ పడేది లేదు."
-మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, పాకిస్థాన్​ సైన్యం అధికార ప్రతినిధి

సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా కర్తార్‌పుర్ నడవా గురుద్వార్ దర్బార్​ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రారంభించనున్నారు. భారతీయ సిక్కులకు పాస్​పోర్ట్​ సహిత, వీసా రహిత ప్రవేశం కల్పిస్తోంది పాక్.

ఇదీ చదవండి: 'కర్తార్​పుర్​ యాత్రికులకు పాస్​పోర్ట్ అవసరం లేదు'

Last Updated : Nov 7, 2019, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details