భారతీయ శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా సైన్స్‌లోని అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు కేంద్ర శాస్త్రీయ, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్. సైన్స్‌లోని కృత్రిమ మేథ, నానో టెక్నాలజీ, అటామిక్ క్లాక్, డేటా అనలిటిక్స్, ఆస్టో ఫిజిక్స్ వంటి అన్ని రంగాల్లో వారు తమదైన ముద్ర వేశారని కొనియాడారు. వివిధ శాస్త్రీయ రంగాల్లో భారత్‌కు అంతర్జాతీయంగా 80కిపైగా దేశాల సహకారం ఉందని చెప్పారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం స్వర్ణోత్సవానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు హర్షవర్ధన్. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల సేవలను కొనియాడారు.
" కొత్త బెంచ్‌మార్క్‌లను సాధించటానికి ప్రస్తుత కొవిడ్-19 వంటి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయక మన శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా పనిచేశారు."