అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ (ఐటీఈఆర్) ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రవేత్తలు విలువైన తోడ్పాటును అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అత్యంత అధునాతన స్థాయిలో ఆకృతుల రూపకల్పన, తయారీ రంగాలకు సంబంధించి భారత సామర్థ్యాలను ప్రదర్శించారని కొనియాడారు.
'ఐటీఈఆర్ ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రవేత్తల విశేష తోడ్పాటు' - Indian scientists have made valuable contributions to ITER project: PM Modi
అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ (ఐటీఈఆర్) ప్రాజెక్టులో భారత శాస్త్రవేత్తల పనితీరును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టుకు విలువైన తోడ్పాటును అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ ఫ్రాన్స్‌లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు న్యూక్లియర్ ఫ్యూజన్ పరికరం భారీ విడిభాగాలను మంగళవారం అనుసంధానించటం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు భాగస్వామ్య దేశాల నేతలు వీడియో సమావేశం విధానంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సందేశాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రాఫ్ చదివి వినిపించారు.
సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుసరించడమే లక్ష్యంగా ప్రారంభించిన భారీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. దీనివల్ల అపరిమితమైన, శుద్ధ ఇంధనం ఉత్పత్తి సాధ్యమవుతుంది. చైనా, అమెరికా, భారత్, రష్యా, దక్షిణ కొరియా, ఐరోపా సంఘంలోని దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.