భారత శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి వృథానీటిలో ప్రాణాంతక మహమ్మారి కొవిడ్ జెనిటిక్ పదార్థాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న వైరస్‌పై నిఘా వేసేందుకు వృథానీటి ఆధారిత వైరస్ విజ్ఞానాన్ని ఉపయోగించేందుకు మార్గం చూపింది. అహ్మదాబాద్‌లో వైరస్ ఉద్ధృతికి తగ్గట్టుగానే వృథానీటిలో కొవిడ్ వైరస్ జన్యు పదార్థాను గుర్తించినట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు.
వృథానీటిలో కరోనా జన్యు పదార్థాల గుర్తింపు!
కరోనా మహమ్మారి వ్యాప్తిపై భారత శాస్త్రవేత్తలు అరుదైన విజయం సాధించారు. వృథా నీటిలో కొవిడ్-19 జెనిటిక్ పదార్థాలను గుర్తించారు. దీంతో వృథానీటి ద్వారా కరోనా సంక్రమణపై పరిశోధన చేస్తున్న కొన్ని దేశాల సరసన భారత్ నిలిచినట్లయింది.
వృథానీటిలో కొవిడ్-19 జెనెటిక్ పదార్థాల గుర్తింపు!
ఈ అధ్యయనం ద్వారా వృథానీటి ఆధారంగా కొవిడ్ సంక్రమణపై పనిచేస్తున్న కొన్నిదేశాల సరసన భారత్ కూడా చేరినట్లు.. బ్రిటన్‌కు చెందిన పర్యావరణ మైక్రోబయాలజిస్ట్ ఆండ్రూ సింగర్ ట్వీట్ చేశారు. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో రోగ ఉద్ధృతిపై అవగాహన చేసుకునేందుకు వృథానీటిలో వైరస్ల సంఖ్య పర్యవేక్షణ మంచి విధానమన్నారు.
ఇదీ చూడండి: 'ఆ లెక్కన చూస్తే భారత్‌లో కేసులు అత్యల్పమే'