తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు

రెండంతస్తుల కంటెయినర్​ రైలును పరుగులు తీయించి భారతీయ రైల్వే గురువారం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గత ఏడాది కంటే ఎక్కువ సరుకు రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

Indian Railways
భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు

By

Published : Jun 12, 2020, 6:57 AM IST

Updated : Jun 12, 2020, 9:57 AM IST

భారతీయ రైల్వే గురువారం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రైలు పట్టాలపై 7.57 మీటర్ల ఎత్తున్న రెండంతస్తుల కంటెయినర్‌ రైలును గుజరాత్‌లో పరుగులు తీయించింది. ఇప్పటివరకు పట్టాలపై పరుగులు తీసిన అతి ఎత్తయిన రైలు ఇదే. ఇలాంటి ఘనత సాధించడం ప్రపంచ రైల్వే చరిత్రలో ఇదే తొలిసారని ఆ శాఖ ప్రకటించింది.

గుజరాత్​లోని పాలన్​పుర్​-బోటాడ్​ స్టేషన్ల మధ్య పరుగులు తీసింది ఈ రెండంతస్తుల కంటెయినర్​ గూడ్స్​ రైలు.

భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు

మొత్తం 32 లక్షల వ్యాగన్లు...

లాక్‌డౌన్‌ సమయంలోనూ గత ఏడాది కంటే ఎక్కువ సరుకు రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మార్చి 24 నుంచి జూన్‌ పది వరకు 32.40 లక్షల వ్యాగన్లు వివిధ రకాల వస్తువులను రవాణా చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:బ్రిటన్​, స్పెయిన్​లను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి..

Last Updated : Jun 12, 2020, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details