జూన్ 30 నుంచి నడవనున్న ప్రత్యేక రైళ్ల టికెట్లను తత్కాల్ బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది భారతీయ రైల్వే. ఇకపై రిజర్వేషన్ కేటగిరిలోనే అన్ని రైళ్లను నడుపనుంది రైల్వే శాఖ.
రైల్వే టికెట్ల తత్కాల్ బుకింగ్ షురూ - indian railway tatkal
లాక్డౌన్ తర్వాత.. తొలిసారిగా ప్రయాణికులకు తత్కాల్ టికెట్ బుకింగ్ అవకాశం కల్పించింది భారతీయ రైల్వే. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ బుకింగ్లు మొదలయ్యాయి.
ప్రయాణికులకు శుభవార్త.. ఇక తత్కాల్ బుకింగ్ చేసుకోవచ్చు!
దాదాపు నెలన్నర రోజుల పూర్తి లాక్డౌన్ తర్వాత మే 12 నుంచి సేవలు ప్రారంభించింది భారతీయ రైల్వే. 30 రాజధాని తరహా, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 230 ప్రత్యేక రైళ్లను తిరగనున్నాయి.
ఇదీ చదవండి:భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు