దేశ వ్యాప్తంగా పలు రైల్వే మార్గాల్లో రద్దీని నియంత్రించే పనులను చేపట్టినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రద్దీగా ఉన్న మార్గాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
'ఇప్పటివరకు మొత్తం 7 'హై- డెన్సిటీ నెట్వర్క్(హెచ్డీఎన్)' మార్గాలను గుర్తించాం. 11,295 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం గుండా సుమారు 60 శాతం ట్రాఫిక్‌తో తీవ్ర సమస్య ఏర్పడుతోంది. అందువల్ల ఈ రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపడుతున్నాం.'
- వినోద్ కుమార్ యాదవ్, భారతీయ రైల్వే ఛైర్మన్