రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలియజేసింది. రైల్వే స్టేషన్లలోని ఆహారశాలలు, ప్లాట్‌ఫాంపై ఉండే దుకాణాల్లో.. ముందుగా వండిన ఆహార పదార్థాల విక్రయానికి భారత రైల్వే క్యాటరింగ్, పర్యాటక సంస్థ(ఐఆర్‌సీటీసీ) అనుమతులు జారీ చేసింది.
స్టేషన్లలో ఆహార పదార్థాల విక్రయాలకు అనుమతి - రైల్వేలో ఆహార పదార్థాల అమ్మకం
రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో వండిన ఆహార పదార్థాల విక్రయానికి భారత రైల్వే క్యాటరింగ్, పర్యాటక సంస్థ(ఐఆర్‌సీటీసీ) అనుమతి ఇచ్చింది. పార్సిల్ రూపంలోనే అమ్మాలని షరతు విధించింది.
స్టేషన్లలో ఆహార పదార్ధాల విక్రయాలకు అనుమతి
అయితే ఈ పదార్ధాలను అక్కడే ఆరగించే వీలు లేదని, పార్సిల్ రూపంలోనే విక్రయించాలని షరతు విధించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రైల్వే స్టేషన్లలో ఆహారపదార్థాల విక్రయాలు నిలిపివేసింది.
Last Updated : Oct 4, 2020, 7:49 AM IST