పర్యాటకుల కోసం కొత్తగా రూపొందించిన విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌లను రైల్వే శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
'విస్టాడోమ్ బోగీ'లతో రైలు ప్రయాణం మరింత ఆహ్లాదకరం - విస్టాడోమ్ కోచ్‌ల ఉపయాగాలు
పర్యాటక ప్రాంతాల్లో రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చేందుకు రూపొందించిన 'విస్టాడోమ్ టూరిస్ట్' కోచ్‌లను రైల్వే శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ కోచ్‌లు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులు 360 డిగ్రీల కోణంలో అన్ని ప్రాంతాలను వీక్షించే వీలుండనుంది.

'గొప్ప విషయంతో ఈ సంవత్సరాన్ని ముగించనున్నాం. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌లను భారతీయ రైల్వే కొత్తగా రూపొందించి విజయవంతంగా పరీక్షించింది. వీటిలో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీనితో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకం లభించనుంది' అని మంత్రి ట్వీట్ చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ కొత్తరకం కోచ్‌లను తయారు చేశారు. వీటిలో ఏర్పాటు చేసిన కిటికీ అద్దాలు చాలా పెద్దగా ఉంటాయి. దీనితో ప్రయాణికులు 360 డిగ్రీల కోణంలో అన్ని ప్రాంతాలను చూసి ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు. వీటిని పర్వత ప్రాంతాల్లో పర్యాటకానికి ఉపయోగించనున్నారు.
ఇదీ చూడండి:రూ.లక్ష కోట్ల ప్రాజెక్టులను సమీక్షించిన మోదీ