తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోబెల్​ గ్రహీత అభిజిత్​పై ప్రశంసల వెల్లువ - తెలుగు తాజా వార్తలు

ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్​ బెనర్జీని నోబెల్​ పురస్కారం వరించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ నాయకులు రాహుల్​ సహా తదితరులు అభినందనలు తెలియజేశారు.

నోబెల్​ గ్రహీత అభిజిత్​కు నాయకుల ప్రశంసల వెల్లువ

By

Published : Oct 14, 2019, 8:39 PM IST

Updated : Oct 14, 2019, 11:25 PM IST

ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త అభిజిత్​ బెనర్జీని ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్​ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా అభిజిత్​కు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధినేత్రి​ సోనియాగాంధీ సహా పలువురు అభినందనలు తెలిపారు. న్యాయ్​ పథకం రూపకల్పనలోనూ బెనర్జీ తనదైన సేవలందించారని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు.

పేదరికంపై...

నోబెల్​ బహుమతి రావడంపై అభిజిత్​ను ప్రధాని మోదీ అభినందించారు. పేదరికంపై ఆయన ఎంతో అధ్యయనం చేశారని... అభిజిత్​ సేవలు ప్రశంసనీయమన్నారు.

దేశం గర్వించే విషయమిది

అతని వ్యూహాలతో దేశాన్ని గర్వించేలా చెయ్యడమే కాక, ప్రపంచంలో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించడంలో కృషి చేశారని సోనియా వివరించారు. బెనర్జీ విధానం, వారి ప్రయోగాలు ఆదర్శప్రాయమని, అటువంటి వ్యక్తికి నోబెల్​ బహుమతి వరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.

కేంద్ర మాజీ మంత్రి స్పందన

అభిజిత్​ బెనర్జీ,ఎస్తర్​ డఫ్లోకు ఎకనామిక్స్​ రంగంలో నోబెల్​ బహుమతి లభించినందుకు ట్విట్టర్​ వేదికగా అభినందనలు తెలియజేశారు కాంగ్రెస్​ కేంద్ర మాజీ మంత్రి జైరామ్​ రమేష్.

సర్వత్రా ప్రశంసల వెల్లువ

‘‘సౌత్‌ పాయింట్‌ స్కూల్‌, కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల పూర్వ విద్యార్థి అభిజిత్‌ బెనర్జీకి హృదయపూర్వక అభినందనలు. దేశాన్ని మరో బెంగాలీ గర్వపడేలా చేశారు. చాలా ఆనందంగా ఉంది’’ -

మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి

‘‘ప్రతి భారతీయుడికీ ఇదో గొప్ప రోజు. ఈ ఏడాది అర్ధశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం దక్కించుకున్న ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీకి హృదయ పూర్వక శుభాకాంక్షలు. పేదరిక నిర్మూలన కోసం చేసే పనికి విశేష ఆమోదం లభిస్తుంది’’

- అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ సీఎం

అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సాధించిన అభిజిత్‌కు అభినందనలు. ప్రపంచంలో పెరిగిపోతున్న పేదరికంపై ఆందోళన వ్యక్తంచేస్తూ దాన్ని నిర్మూలించేందుకు చూపించిన మార్గాలు ప్రశంసనీయం. ప్రెసిడెన్సీ, జేఎన్‌యూ పూర్వ విద్యార్థులపై జరుగుతున్న దుష్ప్రచారంలో పసలేదని మరోసారి రుజువు చేశారు. పూర్వ విద్యార్థుల్ని గర్వపడేలా చేశారు. ప్రెసిడెన్సీ కళాశాల నుంచి మరో నోబెల్‌ సాధించిన వ్యక్తిగా నిలిచారు’’- సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
అభిజిత్‌ స్వయంగా మంచి వంటగాడు‌. భారతీయ శాస్త్రీయ సంగీతం గురించి అపారమైన జ్ఞానం కలిగినవాడు. భారతీయ సంస్కృతికి, విజ్ఞానానికి ఆయన ప్రతినిధిగా నిలుస్తున్నారు. ప్రపంచం మొత్తానికి ఆయన జ్ఞానాన్ని పంచుతున్నారు.

- రామచంద్ర గుహా, ప్రముఖ చరిత్రకారుడు

నోబెల్‌ సాధించిన అభిజిత్‌ బెనర్జీకి అభినందనలు. పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన అద్భుతమైన కృషి భారత్‌ను గర్వపడేలా చేసింది. ప్రఖ్యాత ఆర్థిక వేత్త అయిన అభిజిత్‌ బెనర్జీ.. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన న్యాయ్‌ కార్యక్రమానికి కీలక కన్సల్టెంట్‌గా పనిచేశారు’’

- కాంగ్రెస్‌ పార్టీ

పేదరికం నిర్మూలన పరిశోధనలో వరించిన పురష్కారం

​ఆర్థిక శాస్త్రం విభాగంలో ఆయన భార్య ఎస్తర్​ డఫ్లో, మైఖేల్​ క్రమెర్​తో కలిసి ఈ అవార్డును అందుకోనున్నారు అభిజిత్​. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్​ కమిటీ.

ఇదీ చూడండి: తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?

Last Updated : Oct 14, 2019, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details