తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శునకాల స్వైరవిహారం.. వెనక్కి మళ్లిన విమానం!

గోవా దబోలిమ్​ విమానాశ్రయంలో శునకాల స్వైర విహారం.. ఓ విమానం దిగేందుకు ఆటంకంగా మారింది. ముంబయి నుంచి గోవాకు మంగళవారం తెల్లవారుజామున చేరుకున్న విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించిన పైలట్ రన్​వేపై శునకాలను చూసి వెనక్కి మళ్లారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత నౌకాదళం, గోవా ప్రభుత్వాలు శునకాల తరలింపునకు నడుం బిగించాయి.

శునకాల స్వైర విహారం... విమానం ల్యాండింగ్​కు అంతరాయం

By

Published : Aug 14, 2019, 9:29 AM IST

Updated : Sep 26, 2019, 11:02 PM IST

ముంబయి నుంచి గోవాకు వెళ్లిన ఎయిర్​ఇండియా విమానం అనుకోని సమస్య వల్ల దిగడంలో సమస్యను ఎదుర్కొంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు గల కారణమేంటో తెలుసా... శునకాల స్వైర విహారం.

ఎయిర్​ ఇండియా విమానం-సర్వీస్ 033 ముంబయి నుంచి గోవా దబోలిమ్​​ విమానాశ్రయానికి వెళ్లింది. తెల్లవారుజామున ల్యాండింగ్​ చేసేందుకు ప్రయత్నించారు పైలట్. రన్​వేపై శునకాలు తిరుగుతున్న కారణంగా వెనక్కి మళ్లించారు. మరోసారి దిగేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. ఈ ఘటనను గోవా ప్రభుత్వం, భారత నౌకాదళం సీరియస్​గా తీసుకున్నాయి. విమానాశ్రయంలో శునకాలను అరికట్టేందుకు 'ఐఎన్​ఎస్ హంస' ఉద్యోగులను నియమించనున్నట్లు స్పష్టం చేసింది నావికా దళం. విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న రెండొందల శునకాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకుందిరాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: జల్​ జీవన్ మిషన్​ : ప్రతి గ్రామీణ గృహానికీ కుళాయి నీళ్లు

Last Updated : Sep 26, 2019, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details