అరేబియా సముద్రంలో మిగ్-29కే శిక్షణా విమానం కూలిన ఘటనలో పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని గుర్తించినట్టు భారత నావికాదళం వెల్లడించింది. గోవా తీరానికి 30 మైళ్ల దూరంలో, సముద్రమట్టానికి 70మీటర్ల లోతులో మృతదేహం లభించినట్టు వివరించింది.
మిగ్-29కే కూలిన ఘటనలో పైలట్ మృతి
నావికాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణా విమానం కూలిన ఘటనలో పైలట్ కమాండర్ నిశాంత్ మృతదేహం అరేబియా సముద్రంలో లభించింది. ఈ విషయాన్ని నావికాదళం సోమవారం ప్రకటించింది. గత నెల 26న సముద్రంలో విమానం కూలిపోగా.. ఓ పైలట్ క్షేమంగా బయటపడ్డారు.
మిగ్-29 కూలిన ఘటనలో పైలట్ మృతి
నవంబర్ 26, సాయంత్రం 5 గంటల సమయంలో విమానం కూలింది. ఘటనలో ఓ పైలట్ క్షేమంగా బయటపడగా మరో పైలట్ కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది నావికాదళం. ఈ పూర్తి వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
ఇదీ చూడండి:-మంగళవారం 'భారత్ బంద్'- అన్ని వర్గాల మద్దతు!