మాస్కుల విషయంలో భారత నౌకాదళానికి చెందిన సదరన్ నేవల్ కమాండ్ తమ సిబ్బందికి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సైనికులంతా దుస్తులకు మ్యాచయ్యే మాస్కులు ధరించాలని సూచించింది. తెలుపు దుస్తుల్లో ఉన్నప్పుడు అందుకు సరిపోలే ముసుగులే వినియోగించాలని.. ఇక ఏదైనా కార్యక్రమానికి అయితే నలుపు, నేవీ రంగు మాస్కులు ఉపయోగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది కొచ్చిలోని నౌకాదళ విభాగం.
ఖాకీ యూనిఫామ్ ధరించే రక్షణ, అగ్నిమాపక సిబ్బంది.. విధుల్లో ఉన్న సమయంలో ఖాకీ ముసుగులు తొడుక్కోవాలని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా మాస్కులు ఉపయోగించకపోతే జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. తొలిసారి రూ.200, రెండోసారి రూ.2000 వసూలు చేస్తామని తెలిపారు.