తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్​బుక్, ట్విట్టర్​ సాయంతో జైలు జీవితం నుంచి విముక్తి - Youngsters appealed on social media and raised Rs. 72 lakh, Govind of Nagaur released from Saudi jail after paying fine

పొట్ట కూటి కోసం విదేశానికి వెళ్లిన వ్యక్తి విధి వక్రించి కటకటాలపాలయ్యారు. ఐదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న అతని విడుదలకు సామాజిక మాధ్యమాలు సాయం చేశాయి. కోర్టుకు చెల్లించవలసిన రూ.72 లక్షల భారీ జరిమానాను విరాళాల రూపంలో సేకరించి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించారు అతని స్నేహితులు.

ఫేస్​బుక్, ట్విట్టర్​ సాయంతో జైలు జీవితం నుంచి విముక్తి

By

Published : Nov 2, 2019, 7:24 PM IST

Updated : Nov 2, 2019, 8:54 PM IST

రాజస్థాన్​లోని నాగౌర్​ జిల్లాకు చెందిన గోవింద్ భాకర్​ బతుకుదెరువు కోసం ఎనిమిదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. డ్రైవర్​గా ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. అంతా సజావుగా ఉందనుకున్న సమయంలో విధి వక్రించింది. ఆయన నడుపుతున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మరణించారు. ప్రమాదానికి కారణమైన గోవింద్​ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రూ. 72 లక్షల భారీ జరిమానా విధించింది. పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించే స్తోమత లేక కటకటాలపాలయ్యారు గోవింద్.

దాదాపు ఐదున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇప్పుడు జరిమానా కట్టి బయటకు వచ్చారు. కోర్టుకు కట్టే 72 లక్షల రూపాయలు సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించడం విశేషం.

సోషల్​ మీడియా ద్వారా డబ్బు సేకరణ

పేద కుటుంబం నుంచి వచ్చిన గోవింద్ భారీ మొత్తంలో జరిమానా చెల్లించడానికి అతనికి సామాజిక మాధ్యమాలు సాయం చేశాయి. రూ.72లక్షలను అతని స్నేహితులు, స్థానిక యువకులు సంవత్సరం పాటు కష్టపడి పోగు చేశారు. గోవింద్​ దుస్థితిని సామాజిక మాధ్యమాల్లో వివరించి విరాళాలు సేకరించారు.

త్వరలో స్వదేశానికి

జైలు నుంచి బుధవారం విడుదలైన గోవింద్​ భాకర్​ త్వరలోనే స్వదేశానికి రానున్నారు.
గోవింద్​కు వివాహమై సంతానం కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత గోవింద్​ జైలు నుంచి విడుదలైనందున కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు.

Last Updated : Nov 2, 2019, 8:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details