ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డు ప్రముఖ పాత్రికేయుడు రవీష్ కుమార్‌ను వరించింది. ఓ జాతీయ టీవీ ఛానల్‌లో సీనియర్ పాత్రికేయుడిగా పని చేస్తోన్న రవీష్... 2019 ఏడాదికిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రవీష్‌తో పాటు కో స్వే విన్ (మయన్మార్), అంఖానా నీలపైజిత్ (థాయ్లాండ్), రేముండో పుజంతే కాయబ్యాబ్ (ఫిలిప్పీన్స్), కిమ్ జోంగ్ కీ (దక్షిణ కొరియా) మెగసెసె అవార్డును గెలుచుకున్నారు.
రవీష్ కుమార్కు 'రామన్ మెగసెసె' అవార్డు - MAGSAYSAY
ప్రముఖ పాత్రికేయుడు రవీష్ కుమార్‌ను రామన్ మెగసెసె అవార్డు వరించింది. రవీష్‌తో పాటు మరో నలుగురు ఈ బహుమతిని గెలుచుకున్నారు.
![రవీష్ కుమార్కు 'రామన్ మెగసెసె' అవార్డు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4016538-791-4016538-1564723154542.jpg)
రవీష్ కుమార్కు 'రామన్ మెగసెసె' అవార్డు
'ప్రైమ్ టైమ్' అనే కార్యక్రమం ద్వారా పౌరుల సమస్యలను, వారి వాస్తవ స్థితిగతులను రవీష్ కుమార్ ప్రపంచానికి తెలియజేస్తున్నారని అవార్డు కమిటీ తెలిపింది. ప్రజల గొంతుకగా ఉన్నవారే పాత్రికేయుడని ఈ సందర్భంగా పేర్కొంది.