తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు - స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2020

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు ప్రధాని. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్య అతిథుల మధ్య మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. అంతకుముందు రాజ్​ఘాట్​లో మహాత్ముడికి నివాళులర్పించారు మోదీ.

indian-independence-day-celebrations-pm-modi-salutes-national-flag-at-red-fort
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

By

Published : Aug 15, 2020, 7:39 AM IST

Updated : Aug 15, 2020, 7:48 AM IST

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ పరిమిత సంఖ్య అతిథుల మధ్య త్రివర్ణ జెండాకు గౌరవ వందనం చేశారు మోదీ.

అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. ఈ వేడుకకు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్, కాంగ్రెస్​ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్ సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోటపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు. తాజాగా ఆ రికార్డును మోదీ తిరగరాశారు.

ఇవీ చూడండి:-రాజ్​ఘాట్​కు మోదీ- మహాత్ముడికి నివాళి

Last Updated : Aug 15, 2020, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details