బిహార్ సరిహద్దులో నేపాల్ సాయుధ పోలీసు బలగాలు, స్థానికుల మధ్య ఘర్షణతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. ఘర్షణ సమయంలో కస్టడీలోకి తీసుకున్న భారతీయుడు రామ్ లగాన్ యాదవ్‌ను విడిచిపెట్టారు నేపాల్ పోలీసులు.
ఘటన జరిగిన వెంటనే నేపాల్ అధికారులతో స్థానిక కమాండర్లు సంప్రదింపులు జరిపినట్లు సశస్త్ర సీమా బల్ డీజీ రాజేశ్ చంద్ర శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఇది పూర్తిగా స్థానిక సమస్యగా పేర్కొన్నారు. ఇరు దేశాల అధికారుల మధ్య సంప్రదిపులతో సమస్య పరిష్కారానికి వచ్చినట్లు తెలుస్తోంది.