పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువుల ఇళ్లను కూల్చడంపై పాకిస్థాన్ హైకమిషనర్ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. పాక్ పంజాబ్ రాష్ట్రం యజ్మాన్ ప్రాంతంలోని ఇళ్లను.. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ కూల్చేశారు పాక్ అధికారులు. ఇవి అక్కడ మైనారిటీలైన హిందువులవి. ఈ నేపథ్యంలో పాక్ విధానాన్ని తప్పుపట్టింది భారత్. పాక్‌లోని మత, సాంస్కృతిక మైనారిటీలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని భారత పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది.
మైనారిటీలపై దాడులు.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం - pakisthan high commissioner
పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడుల అంశమై భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. పాక్‌లోని మత, సాంస్కృతిక మైనారిటీలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని పేర్కొంది.
మైనారిటీలపై దాడులు.. పాక్ హైకమిషనర్ వద్ద భారత్ అసంతృప్తి
యాజమాన్య హక్కు పత్రాలు సరిగానే ఉన్నప్పటికీ, కూల్చివేత నిలిపేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెచ్చినప్పటికీ.. రాష్ట్ర అధికారులు ఇవేవి పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేత చేపట్టారని పేర్కొంది. ఇది హిందువులను లక్ష్యంగా చేసుకోవడమేనని చెప్పుకొచ్చింది.
ఇదీ చూడండి:ఇస్రో నుంచి నింగిలోకి.. ఇక ప్రైవేటు రాకెట్లు