తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచదేశాల అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సత్తా

ప్రవాస భారతీయులు తాముంటున్న దేశాభివృద్ధిలో మాత్రమే కాకుండా స్వదేశ అభివృద్ధిలోనూ భాగస్వాములవుతున్నారు. క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకిత భావమున్న ప్రవాస భారతీయులను విదేశాలు సైతం కొనియాడుతున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాలకు వెళుతున్న శ్రామికులు మాత్రం అవగాహన లోపంతో మోసంపోతున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ -మైగ్రేట్ వ్యవస్థ ద్వారా విదేశాలకు వెళ్లే కార్మికులు, వారి యజమానులతో కూడిన డేటా బేస్​ను రూపొందించేందుకు విదేశీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది.

Indian Diaspora  bridges of friendship and development
ప్రపంచదేశాల అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సత్తా

By

Published : Mar 4, 2020, 9:36 PM IST

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివసించే ప్రవాస భారతీయులు తాముంటున్న దేశాభివృద్ధిలో మాత్రమే కాకుండా స్వదేశ అభివృద్ధిలో కూడా భాగస్వాములవుతున్నారు. ప్రవాస భారతీయులు కోటీ ఎనభై లక్షలకు పైగా ఉంటారని అంచనా. వారి క్రమశిక్షణ, వృత్తి పరంగా చూపే అంకిత భావం, శ్రద్ధను వారుంటున్న దేశాలు సైతం కొనియాడుతున్నాయి. సాధారణ కార్మికుల దగ్గర్నుంచి అత్యధిక వేతనాలు తీసుకునే వైట్ కాలర్ ఉద్యోగస్తుల వరకు మెచ్చదగిన పరదేశీ ఉద్యోగులుగా ప్రపంచంలో మన్ననలు పొందుతున్నారు. ఉత్తర అమెరికా నుంచి పశ్చిమాసియా వరకు ప్రవాస భారతీయులు ఉపాధి అవకాశాల కోసం వెళుతుంటారు.

యూఏఈలో అత్యధికంగా..

గణాంకాల ప్రకారం ప్రవాస భారతీయుల సంఖ్య అత్యధికంగా యునైటెడ్​ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 34 లక్షలుగా, అమెరికాలో 26 లక్షలు, సౌదీ అరేబియా లో 24 లక్షలుగా ఉంది.

ఇటీవల భారత్​లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో ఉన్న భారత సంతతి వ్యక్తులు అత్యంత ప్రభావితమైన ప్రజలు అని పేర్కొన్నారు. అమెరికా అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ఆయన కొనియాడారు.

గల్ఫ్​ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు..

మిగతా దేశాల ఉద్యోగుల కంటే అత్యంత విశ్వసనీయులు, మెచ్చుకోదగిన విదేశీయులుగా గల్ఫ్ దేశాలలో ఉండే భారతీయులు పేరు పొందారు.

ఆస్ట్రేలియాలో కీలక భూమిక..

ఆస్ట్రేలియా ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యంపై ఓ నివేదిక విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. అభివృద్ధిలో ఆస్ట్రేలియన్ భారతీయులు ముఖ్యభూమిక పోషిస్తున్నారని కొనియాడింది.

ఆస్ట్రైలియా వస్తు ఉత్పత్తి, దేశ వాణిజ్యం అభివృద్ధిలో భారతీయ సంతతివారి పాత్రను నివేదిక ప్రశంసించింది. పారిశ్రామిక రంగంలో సవాళ్లను స్వీకరించడంలోనూ, వారికున్న అభినివేశం, విజ్ఞానం వల్ల ఆస్ట్రేలియ వ్యాపార రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడింది. తాముంటున్న విదేశాలలో అగ్ర శ్రేణి బహుళ జాతి సంస్థలలో అత్యున్నత పదవులను అధిరోహించడం ద్వారా స్వదేశానికి సైతం పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారని పేర్కొంది.

అంతే కాకుండా వారి ఆర్జనలో 60 బిలియన్ డాలర్లకు పైబడి విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్​కు పంపిస్తూ వారి దేశంలో విదేశీ మారక నిల్వలు పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

మోసాలు..

ఇదిలా ఉంటే విదేశాలకు.. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే శ్రామిక వర్గాలు అవగాహనా లోపం కారణంగా మోసపూరిత ఏజెంట్ల బారిన పడి శ్రమదోపిడి వంటి ఇక్కట్లకు లోనవుతున్నారు.

ఎలాగైనా విదేశాలలో ఉద్యోగం సంపాదించాలన్న యావలో పడిన యువత.. మోస పూరిత ఏజెంట్ల వలలో చిక్కుకుని విదేశాలలో సరైన రికార్డులు లేక అక్రమ వలసదారుల కింద నమోదై కష్టాల పాలవుతున్నారు.

వారికి పనులిచ్చిన గల్ఫ్ దేశాల యజమానులు పాస్ పోర్టులను అక్రమంగా లాగేసుకుంటున్నారు. ఇటువంటి సందర్భాలలో వారు తమ ఆధార్, పాస్ పోర్ట్ వంటి వాటిని దాచుకుని తమ ధ్రువీకరణను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

నకిలీ ఏజెంట్లు చెప్పే మాయ మాటలు నమ్మకుండా ఒకటికి రెండు సార్లు అన్ని విషయాలు సరిచూసుకుని విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇటువంటి వాటిని నివారించేందుకు పాసు పోర్టుల్లో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ముద్రను స్వదేశంలో భారత విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ నమోదు చేస్తుంది.

నూతన వ్యవస్థ..

ఈ -మైగ్రేట్ వ్యవస్థ ద్వారా విదేశాలకు వెళ్లే కార్మికులు, వారి యజమానులతో కూడిన డేటా బేస్ రూపొందించి అక్రమాలు నివారించేందుకు విదేశీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు భారత సామాజిక సంక్షేమ ఫండ్ పేరుతో ఒక ఫండ్ ఏర్పాటు చేసి విదేశాలలో సరైన రికార్డులు లేకుండా మగ్గుతున్న వారిని, అక్కడి యజమానుల ఆరళ్లకు లోనవుతున్నారని తిరిగి స్వదేశం పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

విదేశాలలో ఇళ్లలో పనివారుగా, నర్సులు ఇతర ఉద్యోగాలలో చేరిన మహిళలు వేధింపులకు గురైనప్పుడు రాయబార కార్యాలయ సిబ్బంది వారిని రక్షించి వారిని ప్రత్యేక శిబిరాలలో ఉంచుతున్నారు.

ఈ అంశాలపై గల్ఫ్ దేశాలతో భారత్ పలు ఒప్పందాలు సైతం కుదుర్చుకుంది. అక్కడి రాయబార కార్యాలయాలు 24 గంటలు పని చేసే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది.

ప్రవాస భారతీయ దివస్​..

విపత్కర పరిస్థితుల్లో ఉన్న భారతీయుల సంక్షేమార్థం మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ప్రముఖ ప్రవాస భారతీయులను, విదేశాలలో ఉన్న భారత సంతతికి వారికి అవార్డుతో సత్కరిస్తోంది.

ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఆయా దేశాలలో ఉండే రాయబార కార్యాలయాలను సంప్రదించి వారి సహాయాన్ని తీసుకోవాలని ప్రవాస భారతీయులకు భారత విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ చెబుతోంది.

విదేశాలలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తమ దేశ పౌరులనే కాక తన పొరుగు దేశాల వారిని కూడా సురక్షితంగా అక్కడ్నుంచి తరలించడంలో భారత్ అన్ని దేశాలకంటే ముందుంది. ఇటీవల చైనాలో కొరోనా వైరస్ ప్రభావం ఏర్పడినప్పుడు ఆ దేశంతో పాటు యెమెన్, లిబియా, లెబనాన్, సిరియా, ఇరాక్ దేశాల నుంచి తమ దేశస్తులతో పాటు పొరుగు దేశస్తులను కూడా భారత్ తరలించింది.

ఇదీ చూడండి:'అల్లర్లతో భరతమాతకు ఎలాంటి ప్రయోజనం లేదు'

ABOUT THE AUTHOR

...view details