తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్వదేశీ వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకం' - కొవిడ్​ వ్యాక్సిన్​ ట్రయల్స్​ భారత్​లో

భారత్​లో అభివృద్ధి చేస్తున్న కొవిడ్​-19 వ్యాక్సిన్​ క్యాండిడేట్స్​ క్లినికల్​ ట్రయల్స్​ లో సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. జులై 2021 నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని పేర్కొంది .ఐసీఎంఆర్​​ నిబంధనలకు లోబడే వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నట్లు అసోసియేషన్​ ఆఫ్ హెల్త్​కేర్​ డైరెక్టర్​ జనరల్​ డా. గిరిధర్​ గయాని ఈటీవీ భారత్​కు తెలిపారు.

'Indian COVID vaccine candidates doing well in clinical trials'
'వచ్చే జులై నాటికి స్వదేశీ కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి '

By

Published : Oct 7, 2020, 5:33 AM IST

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్న వేళ భారత్​లో అభివృద్ధి చేస్తున్న కొవిడ్​-19 వ్యాక్సిన్​ క్యాండిడేట్స్​ క్లినికల్​ ట్రయల్స్​లో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ​ ట్రయల్స్​ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

భారత్​లో అభివృద్ధి చేస్తున్న భారత్​ బయోటెక్, జైడస్​ కాడిలా వ్యాక్సిన్​లు ప్రస్తుతం రెండోదశ క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జులై నాటికి వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నాయి.

సీరంతో చేతులు కలిపిన ఐసీఎమ్​ఆర్​

సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా, ఐసీఎమ్​ఆర్​ సంయుక్తంగా రెండు వ్యాక్సిన్​లకు క్లినికల్​ ట్రయల్స్ నిర్వహించనున్నాయి. వీటిలో ఆక్స్​ఫర్డ్​​ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ ఒకటికాగా , ఆస్ట్రాజెనికా మరొకటి.

రష్యా వ్యాక్సిన్ క్లినికల్​ ట్రయల్స్​

రష్యా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ని భారత్​లో నిర్వహించేందుకు డా. రెడ్డీస్​ ల్యాబ్స్ సన్నాహాలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details