భారత్-చైనా సైనికుల ఘర్షణ- పలువురికి గాయాలు - #india vs china
10:48 May 10
భారత్-చైనా సైనికుల ఘర్షణ- పలువురికి గాయాలు
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కిం సెక్టార్ 'నాకు లా' ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో అనేక మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాసేపటి తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకున్నారు.
"చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. ఇలాంటి సందర్భాల్లో రెండు దేశాల సైన్యాలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించుకుంటాయి." అని అధికారిక వర్గాలు తెలిపాయి.
భారత్-చైనా సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఇరు దేశాల సైనికుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతుంటాయి.