అమెరికాలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భారత సంతతి వైద్యురాలు ప్రీతి సుబ్రమణిఅరుదైన గౌరవం అందుకున్నారు. మహమ్మారిపై పోరాడటానికి ఆమె చేసిన కృషికి గాను వైరస్ నుంచి కోలుకున్నవారు తమ ఇళ్లకు వెళుతున్నప్పుడు వైద్యురాలి ఇంటి ముందు నుంచి వరుస క్రమంలో కార్లు నడుపుతూ ఆమెకు కృతజ్ఞతలు(డ్రైవ్ ఆఫ్ ఆనర్) తెలిపారు.
అమెరికాలో భారత సంతతి వైద్యురాలికి అరుదైన గౌరవం - Indian based doctor received 'Drive of Honour' in US
అమెరికాలో కరోనా రోగులకు తన శక్తి సామర్థ్యలతో చికిత్స అందిస్తున్న ఓ భారత సంతతి వైద్యురాలు డ్రైవ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. ప్రాణాంతక వైరస్‌పై ఆమె చేసిన అద్బుత పోరాటానికి గాను ఆమె ఇంటి ముందు నుంచి వరుస క్రమంలో కార్లను నడుపుతూ.. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
భారత సంతతి వైద్యురాలికి అరుదైనా గౌరవం
కర్ణాటకలోని కొడగుకు చెందిన డాక్టర్ ప్రీతి సుబ్రమణి, అమెరికా సౌత్ విండ్సర్ హాస్పిటల్‌లో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆమె చేసిన అసాధారణమైన సేవకు గుర్తింపుగా ప్రశంసలు అందుకుంటున్నారు.