చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత సైనిక కమాండర్ల భేటీకి రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ద్వైవార్షిక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులు సహా వ్యయాలను తగ్గించేందుకు వస్తున్న ప్రతిపాదనపై సైనికాధికారులు చర్చించనున్నారు.
అక్టోబర్ 26 నుంచి 29 వరకు దిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సైన్యంలోని అత్యున్నత అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. భారత ఆర్మీ ఉప అధిపతి, కమాండర్లు, సైనిక ప్రధాన కార్యాలయ ప్రిన్సిపల్ స్టాఫ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొనున్నారు.