తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత సైన్యంపై తప్పుడు ప్రచారం- కేంద్రం స్పందన

భారత్‌, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వేల సంఖ్యలో భారత సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే దీనిపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలు అవాస్తవమని ప్రకటించింది.

By

Published : Sep 14, 2020, 12:02 PM IST

pib india
భారత సైన్యం

"లద్దాఖ్‌ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45 సంవత్సరాల్లో తొలిసారిగా 80,000 మందికి పైగా భారత సైనికులు సిక్‌లీవులకు దరఖాస్తు చేసుకున్నారు’" అంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ అసత్యాలని ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది.

పీఐబీ ట్వీట్

ఈ కారణంగా భారతీయ సైనికులు ఎవరూ సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఈ విధమైన వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. భారతీయ భద్రతాదళ అధికారులు స్పష్టం చేశారు.

లద్దాఖ్‌ ప్రాంతంలోని భారత్‌-చైనా సరిహద్దుల వద్ద గల్వాన్‌ లోయలో.. జూన్‌లో జరిగిన వివాదంలో 20 మంది భారతీయ సైనికులు అమరులవటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో భారీ సంఖ్యలో చైనా భద్రతాదళ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. అంతేకాకుండా, ఇటీవల భారత్‌, చైనా‌ సైన్యాల మధ్య ఇటీవల గాల్లోకి కాల్పుల సంఘటన చోటుచేసుకోవటంతో సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

ఇదీ చూడండి:'సైన్యం వెంట యావత్​ దేశం ఉందనే సందేశం ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details