తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో పాక్ డ్రోన్​ కూల్చివేత - భారత సైన్యం

రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​లో భారత్​లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సైన్యం పేల్చివేసింది.

పాక్ డ్రోన్

By

Published : Mar 9, 2019, 6:44 PM IST

భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సైన్యం పేల్చేసింది. రాజస్థాన్​లోని శ్రీ గంగానగర్​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ డ్రోన్ చొరబాటుకు ప్రయత్నించినట్లు సైన్యాధికారులు వెల్లడించారు.

జైషే ఉగ్రసంస్థలపై మెరుపు దాడులతర్వాత పాకిస్థాన్ డ్రోన్​లు భారత్​లోకి చొరబాటుకు యత్నించడం ఇది మూడోసారి.

భారత్​-పాక్​ మధ్య వైమానిక దాడి జరిగిన రోజు గుజరాత్​లోని కచ్​ సరిహద్దు వద్ద చొరబాటుకు యత్నించిన పాక్​ డ్రోన్​ను భారత సైన్యం నేలకూల్చింది.

రెండో సారి రాజస్థాన్​లోని బికానేర్​ సరిహద్దులో భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు పాక్​ డ్రోన్​ ప్రయత్నించింది. సైనికులు దాన్ని పేల్చివేశారు. ప్రస్తుతం మరోసారి పాక్​ డ్రోన్​ చొరబాటును భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.

ABOUT THE AUTHOR

...view details