పాక్ దుర్నీతికి దీటుగా బదులిస్తోంది భారత్. కశ్మీర్లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడిని బలిగొన్న దాయాది దేశ చర్యకు ప్రతీకారంగా.. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం లోయలో ఉన్న ఉగ్రశిబిరాలపై కాల్పులు జరిపి 4 స్థావరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. ఈ ఘటనలో నలుగురు లేదా ఐదుగురు పాక్ జవాన్లు మరణించారని తెలిసింది. అనేక మంది గాయపడ్డారు. పలువురు తీవ్రవాదులూ చనిపోయినట్లు సమాచారం. దాయాది దేశానికి భారీ ఆస్తినష్టం జరిగింది.
ఉదయం నుంచే...
ఉదయం నుంచి కశ్మీర్ టాంగ్ధర్ సెక్టార్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సహకరిస్తూ... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పొరుగు దేశం దాడిలో ఇద్దరు భారతీయ జవాన్లు, ఒక పౌరుడు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. పాక్ దాడిలో ఓ ఇల్లు, రైస్‌మిల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 19 ఎద్దులు, గొర్రెలు ఉన్న రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి.
జవాన్ల మృతిని తీవ్రంగా పరిగణించింది భారత సైన్యం. గంటల వ్యవధిలోనే పాక్‌పై ప్రతీకార దాడికి దిగింది.
ఇదీ చూడండి: ఆ పిల్లాడిని చూసి మృత్యువు పారిపోయింది!