తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవత్వం: చైనీయులను కాపాడిన భారత సైన్యం

భారత్​- చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దేశంలో చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో భారత సైన్యం చేసిన ఓ పని శత్రుదేశాన్నే ఆలోచించేలా చేసింది. పొరబాటున భారత భూభాగంలోకి వచ్చిన చైనీయులను భారత సైన్యం ఆదుకుంది.

Indian-Army-rescues-three-Chinese-nationals
మానవత్వం: చైనీయులను కాపాడిన భారత సైన్యం

By

Published : Sep 5, 2020, 5:23 PM IST

కయ్యాలమారి చైనా కాటేసేందుకు కాచుకుని కూర్చొన్నా, దీటైన జవాబిచ్చే సత్తా ఉన్న భారత్‌ మాత్రం ఎంతో సంయమనాన్ని పాటిస్తూ వస్తోంది. గల్వాన్‌ ఘటనలో మన సైనికులను పొట్టన పెట్టుకున్నా.. పొరబాటున భారత భూభాగంలోకి వచ్చిన వారి పౌరుల ప్రాణాలు నిలబెట్టింది. దారితప్పి మన భూబాగంలోకి వచ్చిన చైనీయులను భారత సైన్యం ఆదుకుంది.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చైనీయులు దారి తప్పి.. భారతదేశంలోని ఉత్తర సిక్కిం ప్రాంతానికి చేరుకున్నారు. సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తు, సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో అక్కడి వాతావరణ స్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో అల్లాడుతున్న చైనీయులకు భారత సైన్యం సాయం చేసింది. వారికి ఆక్సిజన్‌, ఆహారం, వెచ్చని దుస్తులు అందించటమే కాకుండా వారు తిరిగి వెళ్లేందుకు దారి చూపింది.

సెప్టెంబర్‌ 3న చోటుచేసుకున్న ఈ సంఘటనకు గురించిన వివరాలను భారత సైన్యం నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. రాజకీయ, సైనికపరంగా వైషమ్యాల సంగతి ఎలా ఉన్నా... శత్రుదేశ ప్రజలను కూడా కాపాడే మానవత్వం తమదంటూ భారత సైన్యం ఈ చర్యతో చాటిచెప్పింది.

ఇదీ చూడండి:చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్​నాథ్​

ABOUT THE AUTHOR

...view details