తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పాక్​ ఉగ్రవాద దేశమనేందుకు వీరిద్దరే నిదర్శనం'

జమ్ము కశ్మీర్​లో పాక్​ ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని భారత్​ బట్టబయలు చేసింది. లోయలో ఉగ్రచర్యలకు ప్రణాళికలు రచిస్తున్న పాకిస్థాన్​ జాతీయులు, లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది సైన్యం. వారిని విచారిస్తున్న దృశ్యాలను బహిర్గతం చేసింది.

భారత సైన్యం

By

Published : Sep 4, 2019, 1:42 PM IST

Updated : Sep 29, 2019, 10:03 AM IST

పాకిస్థాన్​కు చెందిన ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మీడియా ముందు ప్రవేశపెట్టింది భారత సైన్యం. వారికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తుండగా తీసిన వీడియోను ప్రదర్శించారు. లోయలో పాక్​ ఉగ్రదాడులకు సిద్ధమయిందని స్పష్టం చేసింది భారత సైన్యం.

ఈ వీడియోలో వారి శిక్షణ, సంస్థ, ప్రణాళికలకు సంబంధించిన వివరాలు తెలిపారు ముష్కరులు. వీరిని ఆగస్టు 21న కశ్మీర్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

అంతకు ముందు లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్ ధిల్లాన్​ మాట్లాడారు. ఇటీవల కశ్మీర్​ సౌరాలో రాళ్ల దాడిలో గాయపడిన అస్రార్​ అహ్మద్​ ఖాన్​ మరణించినట్లు తెలిపారు. గడిచిన 30 రోజుల్లో ఇది ఆరవ మరణమని తెలిపారు. ఈ మరణాలన్నీ ఉగ్రవాదుల కారణంగానే సంభవించాయన్నారు.

అహ్మద్​ మరణంతో శ్రీనగర్​లో ఆందోళనలు చెలరేగే అవకాశమున్నందున పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు అధికారులు. ​

ఇదీ చూడండి: అంతర్జాతీయ కోర్టులో 'కశ్మీర్'​పై చేతులెత్తేసిన పాక్​!

Last Updated : Sep 29, 2019, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details