లద్దాక్ గాల్వన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో తమిళనాడు రామనాథపురం జిల్లాకు చెందిన హవల్దార్ పళని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పళని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రామనాథపురం జిల్లా, కడులూర్ గ్రామానికి చెందిన పళని.... గత 22 ఏళ్లుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. పళనికి భార్య, ఒక పాప, బాబు ఉన్నారు.
లద్దాక్ ఘర్షణలో అమరుడైన తమిళనాడువాసి - హవల్దార్ పళని
లద్దాక్ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో తమిళనాడు రామనాథపురం జిల్లాకు చెందిన హవల్దార్ పళని ప్రాణాలు కోల్పోయారు. ఆయన గత 22 ఏళ్లుగా భారత సైన్యానికి సేవలందిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
లద్దాక్ ఘర్షణలో అమరుడైన హవల్దార్ పళని
సోమవారం రాత్రి లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా సైనిక దుశ్చర్యకు బలైన పళని మృతి తీవ్రంగా కలచివేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ట్వీట్ చేశారు. పళని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.