తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనీయులపై కన్నేసిన భారత్​.. ఆ శిఖరాలన్నీ మనవే! - ఫింగర్​ 4

చైనాపై పై చేయి సాధించేందుకు భారత సైన్యం పక్కా ప్రణాళికను రచించినట్టు కనపడుతోంది. పాంగాంగ్​ సరస్సు ఫింగర్​ 4 వద్ద ఉన్న చైనీయుల కదలికలను పసిగట్టేందుకు కీలకమైన శిఖరాలను మన జవాన్లు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. గత నెల చివర్లోనే ఈ ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం.

Indian Army occupies heights overlooking Chinese Army positions at Finger 4 along Pangong Tso
చైనీయులపై కన్నేసిన భారత్​.. ఆ శిఖరాలన్నీ మనవే!

By

Published : Sep 10, 2020, 10:46 PM IST

Updated : Sep 11, 2020, 12:56 AM IST

చైనా వక్రబుద్ధిని పసిగట్టిన భారత్​ వేగం పెంచింది. శత్రువు మీద పైచేయి సాధించడానికి పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఫింగర్​ 4 వద్ద పాగా వేసిన చైనీయుల కదలికలను పరిశీలించేందుకు అణువుగా ఉండే ముఖ్యమైన శిఖరాలను భారత్​ ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది.

"పాంగాంగ్​ సరస్సు వెంబడి ఉండే ఫింగర్​ 4 వద్ద ఉన్న చైనా సైనికులను పరిశీలించేందుకు అణువుగా ఉండే శిఖరాలను భారత సైన్యం ఆక్రమించుకుంది. ముందస్తు జాగ్రత్తగా.. పాంగాంగ్​ సరస్సు దక్షిణ ఒడ్డుకు సమీపంలో గత నెల చివర్లో ఈ సైన్యం ఈ చర్యలు చేపట్టింది."

-- భారత సైనిక వర్గాలు.

ఫింగర్​ 4 వద్ద ఉన్న శిఖరాలను చైనా ఆక్రమించుకుందని.. అయితే వారి కదలికలపై నిఘా పెట్టేందుకు సాధ్యపడే పర్వత శిఖరాలను భారత సైన్యం ఆక్రమించుకుందని తెలుస్తోంది. దీనిలో గ్రీన్​ టాప్​ కూడా ఉన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:-ఉద్రిక్తతల వేళ భారత్​-చైనా విదేశాంగ మంత్రుల భేటీ

మే నెల నుంచి ఫింగర్​ 4 వద్ద చైనా పాగా వేసింది. అక్కడి నుంచి వెనక్కి మళ్లేందుకు మొండికేస్తోంది.

చర్చలు...

మరోవైపు భారత్​-చైనా మధ్య గురువారం బ్రిగేడ్​ కమాండర్​, కమాండింగ్​ ఆఫిసర్​ స్థాయిలో చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సమాచార వ్యవస్థ తెగిపోకూడదనే లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయి.

ఇవీ చూడండి:-

చైనా సరిహద్దు మరో నియంత్రణ రేఖగా మారుతుందా?

పోర్న్ పోస్ట్​కు లైక్​తో చైనా రాయబారికి చిక్కులు

Last Updated : Sep 11, 2020, 12:56 AM IST

ABOUT THE AUTHOR

...view details