తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో చైనా దూకుడుకు కారణం ఇదేనా? - భారత్ చైనా నడుమ ఉద్రిక్తతలు

వాస్తవాధీన రేఖ వద్ద చైనా దూకుడుకు భారత సైన్యం వ్యూహాత్మక తప్పిదాలే కారణమని ఓ సీనియర్ అధికారి అంగీకరించారు. ఈ విషయంలో అత్యున్నత స్థాయిలో పరిశీలన జరుగుతోందని ఈటీవీ భారత్​తో తెలిపారు.

india china
సరిహద్దులో చైనా దూకుడుకు కారణం

By

Published : Jun 2, 2020, 8:59 PM IST

ప్రపంచమంతా కరోనా వైరస్​తో పోరాడుతోంటే ఈ విపత్తుకు కారణమైన చైనా మాత్రం భారత్​తో కయ్యానికి కాలు దువ్వుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద భారీగా బలగాలను మోహరించి ఉద్రిక్తతలకు తెరతీసింది.

తూర్పు లద్ధాఖ్​లో భారత సైన్యం చేసిన వ్యూహాత్మక తప్పిదాలను అవకాశంగా తీసుకున్న చైనా వేగంగా స్పందించిందని ఈటీవీ భారత్​కు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

"మన సైన్యం చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలే చైనాకు అవకాశం ఇచ్చాయి. సరిహద్దుల్లో సైన్యంతో పాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చ జరగుతోంది. ఈ విషయంలో పూర్తి స్థాయి పరిష్కారాన్ని కనుగొంటారు."

- సీనియర్ అధికారి

ఈ విషయాన్ని సైన్యం ఉన్నతాధికారులు అంత సులువుగా తీసుకోరని మరో అధికారి తెలిపారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో తప్పకుండా మొదటిరోజే ఈ విషయం చర్చకు వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

యుద్ధ వ్యూహాలకు పదును..

యుద్ధంలో ఉన్నతస్థాయి వ్యూహాలే కార్యాచరణ లక్ష్యాలను సాధించి పెడతాయి. భూమి, ఆకాశ, సముద్ర, ప్రత్యేక బలగాలు, రవాణా సదుపాయాలను వ్యుహాలకు తగినట్లు ఉపయోగించటం ఒక కళ. అప్పుడే యుద్ధంలో విజయం వరిస్తుంది. భారత సైన్యం 2017లో రూపొందించిన సూత్రీకరణ పత్రంలో నాలుగు స్థాయిల్లో యుద్ధ వ్యూహాలపై చర్చించింది. అవి.. రాజకీయ, సైన్యం, కార్యాచరణ, ఎత్తుగడ. ఈ నేపథ్యంలోనే భారత్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తోంది.

నాలుగు చోట్ల..

ప్రస్తుతం చైనాకు దీటుగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది భారత్. ఫలితంగా లద్ధాఖ్​లోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఇరు వర్గాలు బాహాబాహీ తలపడ్డారు. లద్ధాఖ్​లోని పాంగ్యాంగ్​ సరస్సు వద్ద భారత సైన్యం, ఐటీబీటీ బలగాలతో మే 9న చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు ఘర్షణకు దిగారు. అనంతరం మే 22న మరోసారి పోట్లాడుకున్నారు. రెండువైపులా దాదాపు 100 మంది గాయపడ్డారు. అంతకముందు మే 5,6 తేదీల్లో ఉత్తర సిక్కింలో రెండు వర్గాలు తలపడ్డాయి.

బలగాల మోహరింపు..

ఈ ఘర్షణల తర్వాత మరింతగా బలగాలను పెంచాయి రెండు దేశాలు. ఆర్టిలరీ గన్స్​తోపాటు భారీ వాహనాలను తరలించాయి. ఒక వేళ ఉద్రిక్తతలు తీవ్రమైతే బలగాలతో పాటు సామగ్రిని వేగంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే గాల్వన్​, షియోక్ నదుల సంగమం ప్రాంతంలోని గాల్వన్​ లోయలో చైనా స్థావరాలు భారత్​ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

డీబీఓ రహదారితో..

ఎందుకంటే.. ఇక్కడ చైనా కొత్తగా ఏర్పాటు చేసిన స్థావరం భారత్​కు అతి సమీపంలో ఉంది. షియోక్​ నుంచి దౌలత్​ బేగ్​ ఓల్డీ (డీబీఓ)ను కలిపే 255 కిలోమీటర్ల రహదారికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ బేస్​ను నిర్మించారు.

కారాకోరం కనుమ సమీపంలో ఉన్న డీబీఓ భారత్​కు అత్యంత కీలక స్థావరం. వేసవి కాలం కావటం వల్ల రోడ్డు నిర్మాణ పనులను భారత్​ వేగవంతం చేసింది. మంచు కారణంగా ఇక్కడ మే నుంచి సెప్టెంబర్​, అక్టోబర్​ మధ్య కాలంలోనే నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ రహదారి నిర్మాణమే ప్రస్తుతం చైనాకు కంటగింపుగా మారింది.

(రచయిత- సంజీవ్​ కేఆర్​ బారువా)

ఇదీ చూడండి:భారత్​ను చైనా బెదిరించాలని చూస్తోంది- అమెరికా

ABOUT THE AUTHOR

...view details