భారత సైన్యం అధునాతన అమెరికన్ సిగ్ సావర్ రైఫిళ్లను సమకూర్చుకుంది. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయడానికి, నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొనడానికి వీటిని వినియోగించనుంది.
"మొదటి లాట్ 10,000 సిగ్ 716 అసాల్ట్ రైఫిళ్లు భారత్‌కు వచ్చాయి. వీటిని నార్తర్న్ కమాండ్‌కు పంపించాం."
- భారత సైనిక వర్గాలు
జమ్ము కశ్మీర్, పీఓకేలో ఉగ్రవాద నిరోధక చర్యలను నార్తర్న్ కమాండ్ చూసుకుంటుంది. ఇప్పుడు సైన్యం చేతికి అందిన అసాల్ట్ రైఫిళ్లతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను, పాక్ సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి వీలవుతుంది.
సిగ్ సావర్ ఎస్ఐజీ 716 7.26X51 ఎమ్ఎమ్ రైఫిళ్లను భారత నిర్మిత 5.56X45 ఎమ్ఎమ్ ఇన్సాస్ స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. వీటికి అదనంగా స్నైపర్ రైఫిళ్ల కోసం 21 లక్షల రౌండ్ల బుల్లెట్లకు కూడా భారత సైన్యం ఆర్డర్ ఇచ్చింది.