తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధ సన్నద్ధతతో సైన్యం​.. అశాంతి సృష్టిస్తే అంతే! - ఉద్రిక్తతలు

ఐదు నెలలుగా సరిహద్దు వెంట చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రాగన్​ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత సైన్యం.. యుద్ధ సన్నద్ధత చాటుతోంది. తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వెంట భారీగా బలగాల మోహరింపు హిమగిరుల్లో వేడి పెంచుతోంది​. 14,500 అడుగుల ఎత్తులో భారీ ట్యాంకర్లు, దళాలతో చైనాతో-చలితో సమరానికి సై అంటోంది భారత్​.

Indian Army geared up
సరిహద్దులో మోహరింపులు.. భారత్​ యుద్ధ సన్నద్ధత

By

Published : Sep 27, 2020, 2:51 PM IST

సరిహద్దులో మోహరింపులు.. భారత్​ యుద్ధ సన్నద్ధత

లక్ష్యాలను గురితప్పకుండా ఛేదిస్తూ.. శత్రువుపై విరుచుకుపడగలిగే అధునాతన ట్యాంకర్లు. గడ్డ కట్టించే చలిలోనూ ప్రత్యర్థిని చీల్చిచెండాడే సుశిక్షిత పదాతిదళాలు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణక్షేత్రంలో దేశానికి కాపలాగా నిల్చున్నాయి. తూర్పు లద్దాఖ్​లో డ్రాగన్ ఆటలు కట్టించేందుకు సర్వసన్నద్ధతతో ఉంది భారత సైన్యం.

దళాలతో సమరానికి సై

ఓవైపు శత్రుసైన్యం సరిహద్దు వద్ద అశాంతి సృష్టిస్తుంటే.. ఎటువంటి కవ్వింపు చర్యలకూ భయపడేదే లేదన్నట్లు యుద్ధ సన్నద్ధత చాటుతోంది భారత సైన్యం. చలికాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో శిబిరాల నిర్మాణాలను మరింత వేగవంతం చేసింది. ప్రత్యేక సాంకేతికతతో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.

సరిహద్దులో మోహరింపులు

ఉద్రక్తతలకు కేంద్రంగా ఉన్న తూర్పు లద్దాఖ్​లోని ​చుమార్​-దెమ్​చోక్ నియంత్రణ రేఖ వద్దకు... భారీగా సైన్యాన్ని, యుద్ధ పరికరాలను తరలించింది. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు టీ-90, టీ-72 ట్యాంకులను మోహరించింది భారత ఆర్మీ. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని -40 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద పోరాడగల బీఎంపీ-2 పదాతిదళాన్ని సన్నద్ధం చేసింది. ట్యాంకుల్లో ఇంధనం గడ్డకట్టుకుపోకుండా 3 రకాల ఇంధనాలను అందుబాటులో ఉంచింది.

చైనా సైన్యాన్ని ఎదుర్కునేందుకు ట్యాంకులు

సింధూ నది ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని.. అడ్డంకులన్నీ అధిగమించేలా ట్యాంకులను సిద్ధం చేసుకుంటోంది. అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిమిషాల్లోనే నియంత్రణ రేఖ వద్దకు చేరుకునేలా చూసుకుంటోంది సైన్యం. ఇదే దూకుడుతో ప్రస్తుతం దక్షిణ పాంగాంగ్​ సరస్సు వద్ద కీలక శిఖరాలపై పట్టు సాధించింది.

14,500 అడుగుల ఎత్తులో భారీ ట్యాంకర్లు

ఈ నేపథ్యంలో భారత్​-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించటం లేదు. చైనా దురాక్రమణలను దీటుగా తిప్పికొడుతున్న భారత్​.. ప్రస్తుతం ఎల్ఏసీ వెంబడి 50,000 మంది సైనికులను మోహరించింది. శత్రుసైన్యాన్ని ఎదుర్కొనేందుకు పదాతిదళాలతో పాటు శతఘ్నులు, ట్యాంకులు సన్నద్ధంగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details