పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాకు ప్రయత్నించిన ఉగ్రవాదుల చర్యను భారత సైన్యం అడ్డుకుంది. ఈ మేరకు ముష్కరుల కదలికల సమాచారం మేరకు ఉత్తర కశ్మీర్ కేరన్ సెక్టార్‌లో భారత సైన్యం సైనికులను మోహరించింది. కిషన్ గంగా నదీ తీరం వద్ద.. ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టింది.
పక్కా స్కెచ్‌తో ఉగ్ర మూకను అడ్డుకున్న సైన్యం! - Pakistan occupied Kashmir
పాకిస్థాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముష్కరుల ముఠాను సమర్థంగా అడ్డుకుంది భారత సైన్యం. కిషన్ గంగా నదీ తీరం వద్ద.. ఉగ్రవాదుల కదలికలను గుర్తించి.. జమ్ముకశ్మీర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకుంది.
పక్కా ప్రణాళికతో ఉగ్ర మూకను అడ్డుకున్న సైన్యం!
నదికి అవతలి వైపు నుంచి పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ముష్కరులు ఓ తాడుకు టైరును కట్టి ఆయుధ సామగ్రిని రవాణా చేసేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న భారత సైన్యం.. ఉగ్రవాదుల నుంచి నాలుగు ఏకే 74 తుపాకులు, 8 బుల్లెట్ మ్యాగజిన్లు, 240 ఏకే రైఫిళ్ల మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ వైపు లాంచ్ప్యాడ్ల వద్ద 250-300 మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు.
Last Updated : Oct 10, 2020, 12:17 PM IST