తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పును స్వాగతించిన ప్రవాస భారతీయులు - ayodhya indo americans

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును అమెరికాలోని ప్రవాస భారతీయులు స్వాగతించారు. ఈ తీర్పుతో హిందూ - ముస్లిం ఇరు వర్గాలకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.

అయోధ్య తీర్పును స్వాగతించిన ప్రవాస భారతీయులు!

By

Published : Nov 10, 2019, 2:29 PM IST

అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును అమెరికాలోని ప్రవాస భారతీయులు స్వాగతించారు. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న భూవివాదానికి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో.. హిందూ ముస్లిం ఇరువర్గాలకు న్యాయం జరిగిందని అభివర్ణించారు.

ప్రవాస భారతీయుల స్పందనలు:

"అత్యున్నత న్యాయస్థానం తీర్పు హిందూ-ముస్లిం ఇరు వర్గాలకు న్యాయం చేకూర్చేదిగా ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, భారతీయ న్యాయ వ్యవస్థ ఈ తీర్పు ద్వారా విజయం సాధించాయి."

-హిందూ అమెరికన్​ ఫౌండేషన్​.

"ఇరు వర్గాలకు సమతూకం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భవిషత్యులో ఎటువంటి వివాదాలనైనా భారత న్యాయస్థానం పరిష్కరించడంలో సమర్థంగా పనిచేస్తుందనడానికి ఈ తీర్పే నిదర్శనం."

-ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్​ఐఐడిఎస్​).

"రామ జన్మభూమి ఉద్యమం శతాబ్దాల పాటు వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ప్రతీక. తీర్పును స్వాగతిస్తున్నాం. "

-ప్రపంచ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా.

ఇదీ చూడండి : జీడీపీ ఆధార సంవత్సరం మార్పు నిర్ణయం సరికాదు!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details