కరోనా టీకా పంపిణీకి భారతీయ విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందుకు అవసరమైన, అనువైన సామగ్రిని కలిగి ఉన్న దిల్లీ, హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు.. కొవిడ్ టీకా పంపిణీలో కీలక భూమిక పోషించనున్నాయి.
" దిల్లీ విమానాశ్రయంలోని రెండు కార్గో టెర్మినల్స్‌లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతల పరంగా సున్నితమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఏడాదికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగిన ఉష్ణోగ్రత నియంత్రిత పరికరాలు ఉన్నాయి. ఇందులో -25 నుంచి +25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఇవి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి చాలా అనుకూలంగా ఉంటాయి. విమానంలోకి తీసుకెళ్లే సమయంలోనూ ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక కూలింగ్ డోలీలు ఉన్నాయి. వ్యాక్సిన్లను వేగవంతంగా తీసుకెళ్లటం, తీసుకురావటం కోసం ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశాం. "
- దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ ప్రతినిధి.
జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కార్గోలోనూ -25 నుంచి +25 డిగ్రీల ఉష్ణోగ్రతలను నియంత్రించేలా అత్యాధునిక సామగ్రి ఉన్నట్లు తెలిపింది విమానాశ్రయ విభాగం.