భారత వాయుసేన అమ్ములపొదిలో అత్యాధునిక 'అపాచీ ఏహెచ్-64ఈ' యుద్ధ హెలికాప్టర్లు చేరనున్నాయి. ఈ 8 హెలికాప్టర్లను నేడు భారత్‌కు అందించనుంది బోయింగ్ విమాన సంస్థ. మొత్తం 27 హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది వాయుసేన. ఈ ఒప్పందంలో భాగంగా జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లు భారత్‌లో అడుగుపెట్టాయి. నేడు మరో 8 హెలికాప్టర్లను పఠాన్‌కోట్‌లోని వైమానిక దళానికి అందించనుంది బోయింగ్.
ఈ సందర్భంగా పఠాన్‌కోట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది వాయుసేన. ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలన్నింటికి కలిపి మొత్తం 2,200 అపాచీ హెలికాప్టర్లను అందించింది బోయింగ్.
నాలుగేళ్ల తర్వాత..