తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఏపీ పీపీఏ తరహా సమస్యలు పునరావృతం కావు' - latest update on andrapradesh ppa

విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)పై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల వంటివి పునరావృతం కావని భరోసా కల్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​. విద్యుత్తు రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒప్పందాలకు భారత్​ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు.

'ఏపీ పీపీఏ తరహా సమస్యలు పునరావృతం కావు'

By

Published : Oct 14, 2019, 3:32 PM IST

పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి విద్యుత్​ రంగ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలకు భారత్​ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​. ఈ విషయంలో పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

దిల్లీలో జరిగిన 'సీఈఆర్​ఏ వీక్​-ఇండియన్​ ఎనర్జీ ఫోరమ్'​ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు నిర్మల. నిబంధనలు సరళించి, ఆంధ్రప్రదేశ్​​ పీపీఏ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల చట్టానికి సవరణలు చేస్తున్నామని, సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు నిర్మల.

ఆంధ్రప్రదేశ్​ వైఖరితో..

2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్​ ఉత్పత్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకుంది భారత్. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం.

అయితే... విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ను రద్దు చేస్తామని తొలుత ప్రకటించింది ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం. తర్వాత వైఖరిని కాస్త మార్చుకుంది. విద్యుత్​ సుంకాలు తగ్గించేలా సంబంధిత సంస్థలతో మరోమారు చర్చలు జరపాలని సోలార్​ ఎనర్జీ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఈసీఐ), ఎన్​టీపీసీని కోరింది ఏపీ సర్కార్​. ఏపీ చేసిన ఈ ప్రతిపాదనలతో పెట్టుబడిదారుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం పడింది.

ఇదీ చూడండి: 6 పైసల కోసం టెలికాం దిగ్గజాల మధ్య మీమ్స్​ వార్​

ABOUT THE AUTHOR

...view details