వలసవాదాన్ని వ్యతిరేకించి స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన నేతాజీకి భారతావని ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మోదీ... భారతీయుల క్షేమం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు.
నేతాజీకి భారతావని రుణపడి ఉంటుంది: మోదీ - PM Modi breaking'
స్వాతంత్రోద్యమం కోసం కృషి చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధాని నరేంద్రమోదీ. భారతావని ఎల్లప్పుడూ బోస్‌కు రుణపడి ఉంటుందని... ఆయనను స్మరించుకోవడం గర్వకారణమని ట్విట్టర్ ద్వారా కొనియాడారు.
![నేతాజీకి భారతావని రుణపడి ఉంటుంది: మోదీ India will always remain grateful to Subhas Chandra Bose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5810055-50-5810055-1579763741180.jpg)
నేతాజీకి భారతావని రుణపడి ఉంటుంది: మోదీ
భారత స్వాతంత్ర్య సంగ్రామానికి బోస్ తన జీవితాన్ని అర్పించాడని కొనియాడారు మోదీ. ఆయనను స్మరించుకోవడం మనందరికి గర్వకారణం అని ట్వీట్ చేశారు.
Last Updated : Feb 18, 2020, 2:42 AM IST