తూర్పు లద్ధాఖ్‌లో చైనా సరిహద్దుల వద్ద దూకుడుగానే ఉండాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల వద్ద చైనా ప్రభుత్వం బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
దిల్లీలో 3 రోజుల పాటు జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ భేటీలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పాటు పలు సున్నిత అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశం అనంతరం సైన్యం ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేసినా, అందులో ఏ అంశాలపై చర్చ జరిగిందీ వెల్లడించలేదు.